ఢిల్లీ: ఇవాళ సుప్రీంకోర్టు మహోన్నత తీర్పు చెప్పిందని ప్రధాని మోదీ అన్నారు. చరిత్రలో ఇవాళ కొత్త అధ్యయం మొదలైంది. దీర్ఘకాలిక సమస్యపై తీర్పు వచ్చింది. భారతన్యాయ చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం మొదలైంది. అయోధ్యపై తీర్పు వచ్చింది. దశాబ్దాలు సాగిన న్యాయ ప్రక్రియ ఇప్పుడు ముగిసింది. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రపంచమంతా గుర్తించింది. సుప్రీంకోర్టు తీర్పును దేశమంతా స్వాగతించింది. భిన్నత్వంలో ఏకత్వం అనే మంత్రం ఇవాళ సంపూర్ణత్వంతో వికసించింది. భారతదేశపు ఈ మూలమంత్రాన్ని ప్రతీఒక్కరూ గుర్తుంచుకుంటారు. సుప్రీంకోర్టు అన్ని వర్గాల వాదనలను ఎంతో ధైర్యంగా ఆలకించింది. ఏకగ్రీవంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
అందర్ని ఒప్పించడం సులువైన విషయం కాదు. న్యాయమూర్తులు, న్యాయాలయాలకు అభినందనలు. నవంబర్ 9నే బెర్లిన్ గోడ కూలింది. ఈ 9 నవంబర్ దేశ ప్రజలందరినీ కలిసికట్టుగా నడవమని సందేశమిస్తోంది. రెండు వైరుధ్యాలు కలగలసిన తరుణమిది. ఐకమత్యంగా కలిసి ఉండే తరుణమిది. నవభారతంలో భయం, విభేదాలకు ఎలాంటి స్థానం లేదు. కఠినమైన సమస్యలనూ రాజ్యాంగ పరిధిలో పరిష్కరించవచ్చు. ఆలస్యమైనా సరే ధైర్యంగా ఉండటం సబబు. న్యాయవ్యవస్థపై నమ్మకం చెక్కు చెదరకుండా ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పు కొత్త ఉదయాన్ని తీసుకువచ్చింది. కొత్త ప్రారంభానికి శ్రీకారం చుడదాం, నవభారతాన్ని నిర్మిద్దాం. అందరినీ కలుపుకుంటూ అందరి అభివృద్ధి కాంక్షిస్తూ మనం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.