కరోనా మృతుల తరలింపునకు మార్గదర్శకాలు విడుదల

కోవిడ్‌-19 వ్యాధితో చనిపోయిన వారి మృతదేహాల తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. చనిపోయిన వ్యక్తి మృతదేహం తరలించేందుకు ప్రత్యేక సిబ్బంది ఏర్పాటుకు నిశ్చయించింది. ఈ ప్రత్యేక సిబ్బంది ఇతర విధులకు హాజరుకాకుండా చర్యలకు ఆదేశించింది. బాడీని బ్యాగ్‌లో శ్మశానానికి తరలించే ముందు మృతదేహానికి శానిటైజ్‌ చేయాలని పేర్కొంది. మృతదేహాల తరలింపునకు ప్రత్యేక వాహనాలు వినియోగించాలంది. అంత్యక్రియలకు ఐదుగురికి మించి హాజరుకాకూడదని ఆదేశాలు జారీచేసింది.