రౌండ్‌టేబుల్ సమావేశం రాజధానిలో ఎందుకు పెట్టలేదు?: శ్రీదేవి
గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఐదేళ్ల పాటు ప్రజలకు మాయాబజార్ సినిమా చూపించారని విమర్శించారు. చంద్రబాబుకు రాజధాని పర్యటనలో ఎంత ఘనస్వాగతం పలికారో అందరూ చేశారన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ప్రజల్లో ఏమైపోయిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. రాజధాని రైతులను, కూలీలను చంద్రబాబు దగా చేశారని ఆరోపించారు. చంద్రబాబు రౌండ్‌టేబుల్ సమావేశం రాజధానిలో పెడితే ఈసారి చీపుర్లు పడతాయేమోనని భయపడి విజయవాడలో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రైతులను గుంటూరు, విజయవాడలో కూలీలుగా మార్చారని తెలిపారు. అవినీతిలో చంద్రబాబుకు లిమ్కా అవార్డు ఇవ్వొచ్చని సెటైర్ వేశారు. అమరావతి దొంగ చంద్రబాబు అని ఆమె వ్యాఖ్యానించారు.