జర పదిలం

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. మరిన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి కఠిన చర్యలు తప్పవని, ప్రజలు మరిన్ని స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకొని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుందామని బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చినవారిలోనే కరోనా వైరస్‌ బయటపడుతున్నందువల్ల ఇతరదేశాల నుంచి వచ్చినవారిని ఎవరినైనా తప్పనిసరిగా సంపూర్ణ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఇండ్లకు పంపాలని అధికారులను ఆదేశించారు.